‘పట్టణ ప్రగతి’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-06-07T06:57:37+05:30 IST

పట్టణ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలోని 7, 21, 22, 31 వార్డుల్లో సోమవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

‘పట్టణ ప్రగతి’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సూర్యాపేటలో పట్టణ ప్రగతి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటటౌన్‌/ సూర్యాపేట అర్బన్‌/ ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 6 : పట్టణ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలోని 7, 21, 22, 31 వార్డుల్లో సోమవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రూ.60 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల కు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పల్లెలు, పట్టణల్లోని సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తోందన్నారు. దేశంలో మందిర్‌, మసీద్‌ల పేర్లతో ప్రజల మధ్య బీజేపీ ప్రభుత్వం చిచ్చుపెట్టేలా వ్యూహారచన చేస్తుందని మంత్రి ఆరోపించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్టకిశోర్‌, నాయకులు వై వెంకటేశ్వర్లు, సవరాల సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, గులాం యూసీ్‌ఫఖాన్‌, వెంపటి సురేష్‌, బైరు వెంకన్నగౌడ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా అక్షర ఫౌండేషన్‌, ఏన్జీవోస్‌ అసోసియేషన్‌, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ సూర్యాపేట ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌, బాసర, ఐఐఐటీలకు నిర్వహించే ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ల్యాప్‌టా్‌పలో ప్రారంభించారు. కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్‌ చైర్మన్‌ యాస రాంకుమార్‌రెడ్డి, యాకోబ్‌, రాజా, నాగయ్య, వెంకన్న, రాజేంద్రప్రసాద్‌, పాల్గొన్నారు.  


సైనికుల త్యాగం వెలకట్టలేనిది

దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కందగట్ల గ్రామానికి చెందిన సైనికుడు వంగేటి కేశవరెడ్డి పదవీవిరమణ సన్మాన కార్యక్రమంలో కేశవరెడ్డిని సన్మానించి, మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, సర్పంచ్‌ ముద్దం శేషమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, ముద్దం కృష్ణారెడ్డి, తూడి నర్సింహారావు, మర్ల చంద్రారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బత్తుల ప్రసాద్‌, బైరు వెంకన్నగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, సత్యం, వెంకటేఽశ్వర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-07T06:57:37+05:30 IST