తెలంగాణలో ప్రతి పథకం ప్రతిష్టాత్మకం

ABN , First Publish Date - 2022-05-30T06:26:49+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజల గుండెల్లో ప్రతిష్టాత్మకంగా నిలిచిందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

తెలంగాణలో ప్రతి పథకం ప్రతిష్టాత్మకం
గంగదేవీ ఉత్సవాల్లో పాల్గొన్నఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

నడిగూడెం, మే 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజల గుండెల్లో ప్రతిష్టాత్మకంగా నిలిచిందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండలంలోని నారాయ ణపురం, బృందావనపురం, వేణుగోపాలపురం, కరవిరాల, చేన్నకేశవపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి చెక్కు లను ఆదివారం పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ సుధారాణిపుల్లారెడ్డి, జడ్పీటీసీ బానాల కవితనాగరాజు, సర్పంచుల ఫ్లోరం మండల అధ్యక్షుడు దేవబత్తిని వెంకటనర్సయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు పుట్ట రమేష్‌, జి.రాజేష్‌,  పల్లా నర్సిరెడ్డి, బడేటి చంద్రయ్య, కాసాని వెంకటేశ్వర్లు, దేవబత్తిని సురేష్‌ప్రసాద్‌, పాలగుడుప్రసాద్‌, ఆనంతుల ఆంజనేయులగౌడ్‌ పాల్గొన్నారు. నడిగూడెం, నారాయణపురంలో గంగదేవీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పాల్గొన్నారు. 

చిలుకూరు: క్రీడలు శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండలకేంద్రంలో వాలీబాల్‌ వేసవి శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలను ఆదివారం ప్రారంభించారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లో క్రీడామైదానాలను ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కొండా సైదయ్య, సొసైటీ చైర్మన్‌ జనార్థన్‌, పుల్లారెడ్డి, భట్టు శివాజీ, రాంబాబు, నాగేశ్వరరావు, ఆర్గనైజర్లు శోభన్‌ బాబు, విజయశేఖర్‌, లింగరాజు, పీఈటీలు కళ్యాణ్‌, మట్టయ్య, జ్యోతిసింగ్‌ తదితరులు ఉన్నారు.


అవినీతికి పాల్పడితే సహించం : ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌ : అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని నియోజకవర్గంలో విద్యుద్దీకరణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆదేశించారు. పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్తలైన్లు ఏర్పా టు చేయాలన్నారు. లోవోల్టేజీని పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలో కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశిం చారు. నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లోని అనేకమంది లైన్‌మన్లు ఇతర అధికారులపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. కొంతమంది అధికారులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదన్నారు. కిందిస్థాయి సిబ్బంది పనిచేయిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారన్నారు. పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న పథకాలను అర్హులకు చేర్చాలన్నారు. కార్యక్రమంలో డీఈ అమరబోయిన శ్రీనివాస్‌, సక్రూనాయక్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.  


రాష్ట్ర స్థాయి రగ్బీ క్రీడలు ప్రారంభం

నేరేడుచర్ల: రాష్ట్ర స్థాయి రగ్బీ అండర్‌-18 క్రీడలు నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సిటీ సెంట్రల్‌ స్కూల్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను ఇక్కడ నిర్వహించడం అభినందనీయమన్నారు. మొత్తం 29 టీంల క్రీడాకారులు మార్చి ఫాస్ట్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో రగ్బీ ఆసోషియేషన్‌ అధ్యక్షుడు గెళ్లి రవి, చైర్మన్‌ మన్నెం శ్రీనివాసరెడ్డి, జనరల్‌ సెక్రటరీ తరుణ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ మార్కెట్‌ చైర్మన్‌ కడియం వెంకటరెడ్డి, డీసీసీబీ డైరక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి, అరిబండి సురేష్‌, కిష్టిపాటి అంజిరెడ్డి, జయబాబు, శ్రీలత ఉన్నారు.

Read more