ఉపాధి పనులను సకాలంలో గుర్తించాలి

ABN , First Publish Date - 2022-03-16T05:43:27+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సకాలంలో గుర్తించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అఽధికారులను ఆదేశించారు. అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామంలో వననర్సరీ, కందకాల తవ్వకం పనుల ను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించి మాట్లాడారు.

ఉపాధి పనులను సకాలంలో గుర్తించాలి
రామన్నగూడెంలో నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

అర్వపల్లి, మార్చి 15: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సకాలంలో గుర్తించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అఽధికారులను ఆదేశించారు. అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామంలో వననర్సరీ, కందకాల తవ్వకం పనుల ను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో వేస వి కాలంలో వన నర్సరీ మొక్కలు బతకాలంటే గ్రీన్‌ కప్పులు వాడాలని సూచించారు. రైతులు భూమిని చదును చేసుకొని వ్యవసాయ యోగ్య భూములుగా మార్చుకొని ఆరుతడి పంటల పై మక్కువ చూపాలన్నారు. రహదారుల వెంట, చెరువుల్లో కంపచెట్లు ఉంటే వెంటనే తొలగించాలన్నారు. వ్యవసాయ భూముల్లో రాళ్లు ఉంటే వెంటనే ఏరివేసే విధంగా ఉపాధి హామీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేష్‌, ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సుయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, సర్పంచ్‌ పీరమ్మ, ఎంపీడీవో విజయ, ఏపీవో శైలజ, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T05:43:27+05:30 IST