స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-05T06:16:25+05:30 IST

పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు డిమాండ్‌ చేశారు.

స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరాములు

సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

చౌటుప్పల్‌ టౌన, జూలై 4: పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌ పట్టణంలో  సీపీఐ మండల మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ సభలో వారు మాట్లాడుతూ, పరిశ్రమల కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.  ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలను నిర్వహించి ప్రజలలో చైతన్యం కల్పిస్తామని వారు తెలిపారు. సభలో నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, కె.శ్రీనివాస్‌, పల్లె శేఖర్‌రెడ్డి, పగిళ్ల మోహనరెడ్డి, రహమాన, బి.గాలయ్య, రాములు, సుధాకర్‌, రామలింగయ్య, అంజయ్య పాల్గొన్నారు.


Read more