వివాదాల్లేకుండా అర్హులను ఎంపిక చేయాలి

ABN , First Publish Date - 2022-09-30T06:03:49+05:30 IST

: పోడు భూముల కేటాయింపులో వివాదాల్లేకుండా అర్హులను ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు.

వివాదాల్లేకుండా అర్హులను ఎంపిక చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

మేళ్లచెర్వు, సెప్టెంబరు 29 : పోడు భూముల కేటాయింపులో వివాదాల్లేకుండా అర్హులను ఎంపిక చేయాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పోడు భూములపై స్థానిక అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వేపలమాదారం గ్రామంలోని పోడు భూములపై సర్పంచ్‌ సునీతాబాలరాజ్‌ అధ్యక్షతన 15మంది సభ్యులతో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి 409 దరఖాస్తులకు అందులో అర్హులను గుర్తించాలన్నారు. భూమి లేని వారు కూడా దరఖాస్తు చేసుకున్నందున ఎటువంటి వివాదాలు లేకుండా అర్హులను ఎంపికచేయాలన్నారు. కమిటీకి తహసీల్దార్‌, ఆర్‌ఐలు కూడా సహకారాలు అందజేస్తారన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ సైదులు, తహసీల్దార్‌ దామోదర్‌రావు, ఎంపీడీవో ఇసాక్‌ హుస్సేన్‌, ఆర్‌ఐ వాసు, శేషుులతో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Read more