ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి

ABN , First Publish Date - 2022-10-05T05:35:45+05:30 IST

న్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైనందున బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకుండా సెలవులు తీసుకోవద్దని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.

ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

 అనుమతి లేకుండా సెలవులు పెట్టొద్దు 

 కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

 మునుగోడు ఉప ఉన్నిక అధికారులతో సమీక్ష  

చండూరు, అక్టోబరు 4: ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైనందున బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకుండా సెలవులు తీసుకోవద్దని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం చండూరులో ఈవీఎంల భద్రత, పంపిణీ కేంద్రమైన డాన్‌బోస్కో జూనియర్‌ కళాశాలలో అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులంతా ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలన్నారు. సరిపడా సిబ్బంది లేకపోతే, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈఆర్వో జగన్నాథరావు తెలిపారు. నియోజకవర్గంలో మండలాలవారీగా బృందాలను ఏర్పాటు చేసి, వారు ఏఏ బాధ్యతలు నిర్వర్తించాలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ వివరించారు. నియోజకవర్గం మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఎమ్‌సీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ టీం) 6, ఎస్‌ఎ్‌సటీ (సర్వే స్టాస్టిక్స్‌టీం) 6,  ఎఫ్‌ఎ్‌సటీ (ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీం) 7, వీఎ్‌సటీ (వీడియో సర్వేలెన్స్‌ టీం) 6 బృందాల చొప్పున ఏర్పాటు చేశారు. వీఎ్‌సటీ బృందంలో తప్ప మిగిలిన బృందాల్లో 12 గంటలకు ఒకరు చొప్పున ఇద్దరేసి అధికారులను కేటాయించారు. సమావేశంలో డీఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.


కోడ్‌ కూసింది

చండూరు, మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకావడంతో పట్టణంలో అధికారులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు అమలుపరిచే పనిలో నిమగ్నమయ్యారు. మునుగోడు, చండూరు పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో రాజకీయ పార్టీలకు చెందిన వాల్‌ పెయింటింగ్‌లు, పోస్టర్లు అంటించడంతోపాటు, స్థంబాలకు కట్టిన ప్లెక్సీలను మునిసిపల్‌ సిబ్బందితో తొలగించే ప్రక్రియ చేపట్టారు. చండూరులోని కస్తాల ఎక్స్‌రోడ్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహంతోపాటు, పట్టణంలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు మునిసిపాలిటీ సిబ్బంది ముసుగువేశారు. పట్టణంలో ఉన్న రాజకీయ పార్టీల జెండా దిమ్మెల రంగులు తొలగించారు.  

Read more