జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : రమేష్‌

ABN , First Publish Date - 2022-09-19T06:08:53+05:30 IST

రాష్ట్రంలోని వివిధ పత్రిక లు, ఎలక్ర్టానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడబ్ల్యూజేఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యు డు గాదె రమేష్‌ అన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : రమేష్‌
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌

నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 18: రాష్ట్రంలోని వివిధ పత్రిక లు, ఎలక్ర్టానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడబ్ల్యూజేఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యు డు గాదె రమేష్‌ అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ లోని విజయవిహార్‌ అతిథిగృహంలో జరిగిన సంఘ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పనిచేస్తున్న  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు వెంటనే డబుల్‌ బె డ్‌రూం ఇళ్లు  కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సం ఘం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నియోజక వ ర్గ అధ్యక్షుడిగా మూ ల శేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆవుల న రేందర్‌, శ్రీ నివాస్‌, చందులా ల్‌, కార్యదర్శులు, సభ్యులను ఎన్నుకున్నారు.  

Read more