నూతన కార్యాలయాల ఏర్పాటుకు కృషి

ABN , First Publish Date - 2022-09-25T06:00:03+05:30 IST

మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే నో ముల భగత అన్నారు.

నూతన కార్యాలయాల ఏర్పాటుకు కృషి
ఖాళీ స్థలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భగత

తిరుమలగిరి(సాగర్‌), సెప్టెంబరు 24: మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే నో ముల భగత అన్నారు. శనివారం ఆయన స్థానిక రెవె న్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిఽధులతో కలిసి ప్రభుత్వ భవనాలకు అనుకూలంగా ఉన్న స్థలాలను పరిశీలించారు. మండల కేంద్రానికి సమీపంలో ఉండే ప్రభుత్వ స్థలాలను వేగవంతం చేసి సేకరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ పాండునాయక్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఖాజా అజ్ఘర్‌అలీ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య, సర్పంచులు చందులాల్‌, నగేష్‌, బిచ్చానాయక్‌, పాండునాయక్‌, రాంసింగ్‌, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.

 


Read more