పాడి రైతులను ఆదుకునేందుకు కృషి

ABN , First Publish Date - 2022-08-31T06:03:12+05:30 IST

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

పాడి రైతులను ఆదుకునేందుకు కృషి

పాడి రైతులను ఆదుకునేందుకు కృషి 

మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి

నల్లగొండ, ఆగస్టు 30: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని మదర్‌ డెయిరీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గేదె పాల కిలో వెన్నకు రూ.690 ఉండగా రూ.756కు ధర పెంచామన్నారు. ఆవు పాలు కిలో ఘన పదార్ధానికి రూ.270 ఉండగా రూ.313 పెంచిన ట్లు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పెరిగిన ధరలు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. రైతులు ప్రైవేటు డెయిరీలకు కాకుండా మదర్‌ డెయిరీకి పాలు పోయాలని సూచించారు.

Read more