గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కంచర్ల

ABN , First Publish Date - 2022-07-05T06:45:09+05:30 IST

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కంచర్ల
పొనుగోడులో ధ్వజస్తంభాన్ని పరిశీలిస్తున్న భూపాల్‌రెడ్డి

కనగల్‌, జూలై 4:  గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పొనుగోడు గ్రా మంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ని ర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో రూ.20 లక్షలు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. పొనుగోడు చెరువుకు లిప్టు ద్వారా సాగర్‌ నీటిని త రలిస్తానన్నారు అనంతరం గ్రామశివారులోని శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శిథిలమైన ధ్వజస్తంభాన్ని పరిశీలించారు. నూతన ధ్వజస్తంభ ఏర్పాటు కు ఆర్థికసాయం అందిస్తానన్నారు. ఇదిలా ఉంటే గుడిగోపుర నిర్మాణానికి అ య్యే ఖర్చు తను భరిస్తానని టీఆర్‌ఎస్‌ నేత జోగు దయాకర్‌ ఎమ్మెల్యే సమక్షం లో గ్రామస్థులకు హామీనిచ్చారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు పులకరం క్షేత్రయ్య, రామకృష్ణ, కుమార్‌ మరో 20 మంది కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాష, మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు సహదేవరెడ్డి, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాదయ్యగౌడ్‌, ఎంపీటీసీ అండాలు, నాయకులు అశోక్‌, ఊశయ్య, నర్సింహ, లింగయ్య, రవి, శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more