వీఆర్వోలకు విధులు, బాధ్యతలు అప్పగించాలి

ABN , First Publish Date - 2022-07-05T06:39:44+05:30 IST

ప్రభుత్వం వీఆర్వోలకు స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిగొండ సుమన్‌ డిమాండ్‌ చేశారు.

వీఆర్వోలకు విధులు, బాధ్యతలు అప్పగించాలి
నిడమనూరులో వినతిపత్రం ఇస్తున్న వీఆర్వోలు

నిడమనూరు, జూలై 4: ప్రభుత్వం వీఆర్వోలకు స్పష్టమైన విధులు, బాధ్యతలు అప్పగించాలని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిగొండ సుమన్‌ డిమాండ్‌ చేశారు. వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దా ర్‌ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మా ట్లాడారు. జాబ్‌చార్ట్‌ రద్దు చేయడంతో వీఆర్వోలు రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్‌చార్ట్‌ పునరుద్ధరించడంతో పాటు వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే రీలోకేట్‌ చేయాలన్నారు. మృతి చెందిన వీఆర్వోల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు పూర్ణచందర్‌రా వు, పేలపూడి సతీష్‌, సురేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, లక్ష్మి పాల్గొన్నారు.Read more