గుండాల మండలంలో డ్రోన కలకలం

ABN , First Publish Date - 2022-10-05T05:29:21+05:30 IST

వ్యవసాయ పొలంలో డ్రోన పడిన సంఘటన గుండాల మండలంలో కలకలం రేకెత్తించింది.

గుండాల మండలంలో డ్రోన కలకలం

 

పెద్ద శబ్దంతో పొలంలో పడటంతో రైతుల్లో భయాందోళన

గుండాల, అక్టోబరు 4: వ్యవసాయ పొలంలో డ్రోన పడిన సంఘటన  గుండాల మండలంలో కలకలం రేకెత్తించింది. గుండాల మండలం రామారం గ్రామ పరిఽధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలాలా ఉన్నాయి. మండలంలోని రామారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి రాంరెడ్డికి చెందిన పొలం వద్ద ఆకాశం నుంచి పెద్ద శబ్దం చేస్తూ ఓ డ్రోన చెట్ల మధ్య కూలింది. ఈ ఘటనతో సమీపంలోని రైతులు భయాందోళనకు గురయ్యారు. కొద్ది సమయానికి అక్కడికి చేరుకున్న డ్రోనకు సంబంధించిన నిర్వాహకులు దానిని తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో రైతులు డ్రోన 


విషయంపై వారిని ప్రశ్నించగా, గుండాల-మోత్కూరు ప్రధాన రహదారిలోని ఎంజీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో భారత సైన్యానికి సంబంధించిన డ్రోన పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి సమాచారాన్ని ఇవ్వకూడదని తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐ యాకయ్యను వివరణ కోరగా డ్రోన కూలిన సంఘటన తన దృష్టికి రాలేదని తెలిపారు.


Read more