విజయం సాధించే వరకు విశ్రమించొద్దు

ABN , First Publish Date - 2022-09-19T05:44:41+05:30 IST

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేవరకు కార్యకర్తలు విశ్రమించవద్దని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డి, చెవిటి వెంకన్న, సురేందర్‌ ముదిరాజ్‌, జనక్‌ ప్రసాద్‌ బాజ్‌పాయి అన్నారు.

విజయం సాధించే వరకు విశ్రమించొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు రాజేందర్‌రెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌ సెప్టెంబరు 18: మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేవరకు కార్యకర్తలు విశ్రమించవద్దని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డి, చెవిటి వెంకన్న, సురేందర్‌ ముదిరాజ్‌, జనక్‌ ప్రసాద్‌ బాజ్‌పాయి అన్నారు. మండలంలోని ఎస్‌.లింగోటం, కుంట్లగూడెం, ఖైతపురం, లక్కారం, లింగోజిగూడెం గ్రామాల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ స్థాయి సమీక్ష సమావేశాల్లో మాట్లాడారు. బూత్‌స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలన్నారు. ప్రతి బూత్‌లో 25మందితో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ కుటుంబాలను గుర్తించాలని సూచించారు. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని, ప్రతిరోజూ గడపగడపకు ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశాల్లో నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ రాంచందర్‌,  బీమిడి ప్రదీప్‌జీ, కుర్నాల వెంకటేశం, గోపి సుధాకర్‌, తగరం నాగరాజు, లందగిరి బీమయ్య, ఎర్రగోని లింగస్వామి, తొర్పునూరి శ్రీకాంత్‌, గుండు వెంకటేశం, బాతరాజు నాగయ్య, ప్రమీద వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


Read more