ట్రిపుల్‌ఆర్‌కు భూములను బలవంతంగా లాక్కోవద్దు

ABN , First Publish Date - 2022-09-17T06:32:59+05:30 IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ట్రిపుల్‌ఆర్‌) కు బలవంతంగా భూములు లాక్కోవద్దని బాధితులు నిరసన తెలిపారు. భు వనగిరి శివారులోని రాయిగిరి పాత పంచాయతీ వద్ద నిర్వాసితులు శుక్రవా రం సమావేశమయ్యారు.

ట్రిపుల్‌ఆర్‌కు భూములను బలవంతంగా లాక్కోవద్దు
రాయిగిరిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులు

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 16: రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ట్రిపుల్‌ఆర్‌) కు బలవంతంగా భూములు లాక్కోవద్దని బాధితులు నిరసన తెలిపారు. భు వనగిరి శివారులోని రాయిగిరి పాత పంచాయతీ వద్ద నిర్వాసితులు శుక్రవా రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇప్పటికే కాళేశ్వరం, బునాదిగాని కాల్వ, రోడ్డు విస్తరణలు, రిలయన్స్‌ గ్యాస్‌ పైపులైన్‌తో భూములు కోల్పోయామని, ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం భూ ములను సేకరించడం సరికాదన్నారు. అనంతరం రాయిగిరిలో బాధితులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమా ర్‌, కౌన్సిలర్‌ నాయిని అరుణ, బాధితులు గడ్డమీది మల్లేశ్‌, పాండు, దాసరి శ్రీనివాస్‌, అయిలయ్య, నర్సింహారెడ్డి, భద్రయ్య, వీరయ్య, కృష్ణ, పాల్గొన్నారు.


అలైన్‌మెంట్‌ మార్చేలా ఒత్తిడి తీసుకురావాలి

భువనగిరి టౌన్‌: రీజనల్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, ఆలే రు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి నందకుమార్‌ యాదవ్‌, నాయకులు పోతంశెట్టి రవీందర్‌, నర్ల నర్సింగ్‌రావు, కొండం ఉపేందర్‌గౌడ్‌, బాధిత రైతులు మల్లేశం, రామకృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, పాల్గొన్నారు.


తహసీల్దార్‌కు వినతిపత్రం

వలిగొండ: ట్రిపుల్‌ఆర్‌తో భూములు కోల్పోతున్న తమను ఆదుకోవాలని మండలంలోని పొద్దటూరు గ్రామానికి చెందిన అసైన్డ్‌ భూ సమితి సభ్యులు తహసీల్దార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2022-09-17T06:32:59+05:30 IST