దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:58:40+05:30 IST

తెలంగాణ సాయుధపోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో పాలకులపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు.

దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి
సూర్యాపేటలో మాట్లాడుతున్న జూలకంటి

సూర్యాపేట సిటీ / సూర్యాపేట అర్బన్‌ / నడిగూడెం / తిరుమలగిరి / నేరేడుచర్ల,  జూలై 4 : తెలంగాణ సాయుధపోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో పాలకులపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. సూర్యాపేట పట్టణంలో వేర్వేరు చోట్ల నిర్వహించిన దొడ్డి కొమరయ్య 76వ వర్థంతి కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. కొమరయ్య ఆశించిన  పీడన, దోపిడీ లేని తెలంగాణ రాలేదన్నారు. అంతకుముందు కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కోటగోపి, చినపంగి నర్సయ్య, వీరబోయిన రవి, నాయకులు మల్సూర్‌, రాకేష్‌, నాగిరెడ్డి, బెల్లి నాగరాజు, జాని, సోమయ్య, వెంకన్న పాల్గొన్నారు. ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న, బుద్ద సత్యనారాయణ, నర్సయ్య, నజీర్‌, బాస్కర్‌, చిట్టిబాబు పాల్గొన్నారు. నడిగూడెంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ,, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ధీరవెల్లి సుధాకర్‌రెడ్డి, కొరట్ల వెంకటేశ్వర్లు, చాపలమన్సుర్‌, వీరయ్య, చిన్నబిక్షం పాల్గన్నారు. తిరుమలగిరిలో జీఎంపీఎస్‌, పూలే అధ్యయన వేదిక, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కడెం లింగయ్య, కొత్తగట్టు మల్లయ్య, తన్నీరు రాంప్రభు, కందుకూరి సోమన్న, పానుగంటి శ్రీను, నీర్మాల యాకయ్య, లింగయ్య, అనంతుల శ్రీను, వెంకన్న పాల్గొన్నారు. నేరేడుచర్లలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పారేపల్లి శేఖర్‌రావు, కొదమగుండ్ల నగేష్‌, సరిత, తిరుపతయ్య, నీలా రాంమ్మూర్తి, ఎడ్ల సైదులు, శ్రీను, వెంకటయ్య, సైదయ్య పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-05T05:58:40+05:30 IST