బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దు

ABN , First Publish Date - 2022-08-31T06:13:18+05:30 IST

జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయవద్దని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 108 గ్రామాలను బహిరంగ మల, మూత్ర విసర్జన పంచాయతీలుగా ప్రకటించామన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 30: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయవద్దని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 108 గ్రామాలను బహిరంగ మల, మూత్ర విసర్జన పంచాయతీలుగా ప్రకటించామన్నారు. వచ్చే నెల 10వ తేదీనాటికి ఒక మండలానికి చెందిన బృందం మరో మండలంలో తనిఖీ లు నిర్వహించి పరిస్థితిపై నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నా రు.జిల్లాలో హరితహారం, వైకుంఠధామాలు, పల్లె పకృతి వనాలు ఏర్పా టు విషయంలో అశ్రద్ధ వహించకూడదన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఆర్‌డీవో కిరణ్‌కుమార్‌,అదనపు పీడీ పెంటయ్య పాల్గొన్నారు.

Read more