కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దు

ABN , First Publish Date - 2022-06-11T06:43:30+05:30 IST

కేసీఆర్‌ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని మాజీ సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని అభంగాపురం, గజలాపురం గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కాం గ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దు
అభంగాపురంలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడుతున్న జానారెడ్డి

 రాష్ట్రంలో కాంగ్రె్‌సతోనే అభివృద్ధి 

మాజీ సీఎల్పీనేత  జానారెడ్డి

మాడ్గులపల్లి, జూన్‌ 10: కేసీఆర్‌ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని మాజీ సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని అభంగాపురం, గజలాపురం గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కాం గ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, వరంగల్‌ డిక్లరేషన్‌ కాంగ్రెస్‌ గెలుపునకు కృషిచేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఇందిరమ్మ రైతుభరోసా పథకం కింద భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు రూ.15వేలు ఇస్తామ న్నారు. భూమి లేని నిరుపేదలకు, ఉపాధిహామీ కూలీలకు ప్రతి ఏడాది కి రూ.12వేలు ఇస్తామన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రైతులు అప్పులపాలవుతున్నారని, అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవె న్యూ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  కాంగ్రె్‌సపార్టీకి ఓటు వేసి వచ్చే ఎన్నిక ల్లో గెలిపించాలఆ్నరు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కేసీఆర్‌ రైతుల సమస్యలను పట్టించుకోకుండా తప్పుదోవ పట్టించారన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గ్రామాల్లో రైతు డిక్లరేషన్‌ను ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి, అనుముల శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీ పుల్లెంల సైదులు, బుచ్చిరెడ్డి, భాస్కర్‌నాయక్‌, జానయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. 

Read more