మోత్కూరులో జాతీయ జెండా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-18T05:18:01+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో సాయిచైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం 100మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు.

మోత్కూరులో జాతీయ జెండా ప్రదర్శన
జాతీయ నాయకుల వేషధారణ, జెండా ప్రదర్శనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

మోత్కూరు, ఆగస్టు 17: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో సాయిచైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం 100మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. భారతమాత, మహాత్మా గాంధీ, నెహ్రూ, భగతసింగ్‌, ఝాన్సీలక్ష్మీభాయి, రుద్రమదేవి, స్వామి వివేకానంద తదితర స్వాతంత్య్ర పోరాట యోధుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.  జాతీయ జెండాతో తమ పాఠశాల నుంచి జగ్జీవనరామ్‌ చౌరస్తా, పాతబస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా మార్కెట్‌ యార్డు వరకు (సుమారు రెండు కిలోమీటర్లు) భారీ ప్రదర్శన నిర్వహించారు. వంద మంది విద్యార్థులు గ్రీన, ఆరెంజ్‌, వైట్‌ కలర్‌ టీషర్టులు వేసుకుని మార్చ్‌ఫా్‌స్టలో పాల్గొన్నారు.  ఏఎ్‌సఐ కరుణాకర్‌రావు, పాఠశాల ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి ప్రదర్శనకు జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ బి.కవిత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Read more