‘డిండి’కి నిధులు కేటాయించడంలో వివక్ష

ABN , First Publish Date - 2022-09-12T05:23:42+05:30 IST

డిండి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లో ప్రాంతాల మధ్య కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్యయాదవ్‌ ఆరోపించారు.

‘డిండి’కి నిధులు కేటాయించడంలో వివక్ష
భూ నిర్వాసితులకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న ఐలయ్య

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్‌ 

మర్రిగూడ, సెప్టెంబరు 11: డిండి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లో ప్రాంతాల మధ్య కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్యయాదవ్‌ ఆరోపించారు. డిండి ప్రాజెక్టులో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, అజిలాపురం, ఖుదాభక్షిపల్లి రైతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారానికి 11వ రోజుకు చేరుకుంది. వారికి టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు చేస్తున్న న్యాయమైన దీక్షకు స్పందించి వీ రికి వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చే శారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇచ్చి ఇక్కడి వారి పై ప్రభుత్వం నిర్లక్ష్యం, చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రెండున్నరేళ్ల కాలంలో  ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఏడేళ్లయినా కనీసం భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలని, భూనిర్వాసితులు చేస్తున్న దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, నాయకులు పగడాల లింగ య్య, వేణుగోపాల్‌రెడ్డి, యాదయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

మట్టి తవ్వకాలను అడ్డుకున్న వెంకెపల్లి భూ నిర్వాసితులు 

మర్రిగూడ: చర్లగూడెం రిజర్వాయర్‌ కట్ట నిర్మాణం కోసం పనులు  చే సేందుకు వచ్చిన యంత్రాలను వెంకెపల్లి ముంపు గ్రామ భూ నిర్వాసితు లు ఆదివారం అడ్డుకుని నిలిపివేశారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీ పరిహారం, పునరావాసం కల్పించకుండా మట్టి తవ్వకాలను ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు. పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించేంత వరకు రిజర్వాయర్‌కు సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టవద్దని కలెక్టర్‌ను కోరగా పనులు నిలిపివేయాలని ఆదేశించి విషయాన్ని వారు గుర్తు చేశారు. గ్రామంలో 380 మంది కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, గృహాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించలేదని ఇప్పటికే సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పునరావాసం ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం అందించేంత వరకు పనులు జరగనివ్వమని అధికారులతో తేల్చి చెప్పడంతో అధికారులు యంత్రాలను వెనక్కి పంపించారు.  వెంకెపల్లి ముంపు గ్రామ భూ నిర్వాసితులు గంట సేపు మట్టి తవ్వకాల వద్దనే ఉండి తిరిగి వారి ఇళ్లలోకి వెళ్లారు. 

పోటీ చేసే అంశంపై అధిష్ఠానానిదే నిర్ణయం  

మునుగోడురూరల్‌: మునుగోడు ఉప ఎన్నికలో టీడీపీ పోటీచేసే అంశంపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ ఇనచార్జి జక్క లి ఐలయ్యయాదవ్‌ అన్నారు. మునుగోడు మండలం కొంపెల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మునుగోడులో పోటీచేసిన మూడు సా ర్లు బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించిందన్నారు. మిగతా పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, పేద వర్గాలకు రాజ్యాధికారంలో భా గస్వామ్యం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని ఆరోపించారు. సమావేశంలో పార్లమెంట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల నరసింహ, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి మక్కెన అప్పారావు, మర్రిగూడ మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, నాయకులు సింగం గిరిధర్‌, ఇటుకలపాటి ఆరోగ్యం, పుప్పాల యాదయ్య, పంగ కృష్ణయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 


Read more