విద్యుత్‌ కోతలతో సాగుకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-09-28T05:57:29+05:30 IST

విద్యుత్‌ కోతలతో సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ కోతలతో సాగుకు ఇబ్బందులు
రాస్తారోకో చేస్తున్న పోలుమల్ల రైతులు

నూతనకల్‌, సెప్టెంబరు 27 : విద్యుత్‌ కోతలతో సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని సూర్యాపేట-దంతాపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రాస్తారోకో విషయం తెలిసి ఏఈ సురేందర్‌ రైతుల వద్దకు చేరుకున్నారు. పోలుమళ్ల ఫీడర్‌కు అదనపుభారం పడుతుండడంతో కొంత అంతరాయం ఏర్పడిందని, రెండు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. సుమారు గంట పాటు ఆందోళనతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనలో రైతులు లింగరాజు, చంద్రారెడ్డి, పరుశురామములు, లింగయ్య, శ్రీనివాస్‌, ఉపేందర్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 


Read more