26 నుంచి దేవీనవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-24T06:27:18+05:30 IST

జిల్లా కేంద్రంలోని శ్రీవేదాంత భజన మందిరం, శ్రీసంతోషిమాత దేవాలయంలో నేరేడుచర్ల విజయదుర్గా దేవాలయంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగే దేవి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాల కమిటీల చైర్మన్లు రాచర్ల వెంకటేశ్వర్‌రావు, నూక వెంకటేశంగుప్తా, కొణతం ఆదిరెడ్డి, నిర్వాహకులు కొణతం చిన వెంకటరెడ్డి, నాగండ్ల శ్రీధర్‌ తెలిపారు.

26 నుంచి దేవీనవరాత్రి ఉత్సవాలు
నేరేడుచర్లలో ముస్తాబవుతున్న విజయదుర్గా దేవాలయం

సూర్యాపేట కల్చరల్‌, నేరేడుచర్ల, సెప్టెంబరు 23 :  జిల్లా కేంద్రంలోని శ్రీవేదాంత భజన మందిరం, శ్రీసంతోషిమాత దేవాలయంలో నేరేడుచర్ల  విజయదుర్గా దేవాలయంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగే దేవి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాల కమిటీల చైర్మన్లు రాచర్ల వెంకటేశ్వర్‌రావు, నూక వెంకటేశంగుప్తా,  కొణతం ఆదిరెడ్డి, నిర్వాహకులు కొణతం చిన వెంకటరెడ్డి, నాగండ్ల శ్రీధర్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో కమిటీ సభ్యులతో కలిసి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు.  నేరేడేచర్లలో కొణతం ఆదిరెడ్డి మాట్లా డారు. ఉత్సవాల్లో  భాగంగా ప్రతీ రోజు అమ్మవారిని వివిధ రూపాల్లో  అలంకరిస్తామన్నారు.   కార్యక్రమంలో వేదాంత భజనమందిరం ప్రధానార్చకుడు సింగరాచార్యులు పాల్గొన్నారు. 

రూ.1.42లక్షలతో అమ్మవారికి  వెండి చీర   బహూకరణ

నేరేడుచర్ల విజయదుర్గా దేవాలయంలోని అమ్మవారికి రూ.లక్ష 42వేల 696ల విలువైన చీరను నేరేడుచర్లకు చెందిన భక్తులు బహూకరించారు. వెండి చీరను దసరా  రోజు అమ్మవారికి అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్‌ ఆదిరెడ్డి తెలిపారు.
Read more