అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : రవీంద్ర

ABN , First Publish Date - 2022-06-12T06:43:31+05:30 IST

ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : రవీంద్ర
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర

చందంపేట, జూన 11: ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం చందంపేట మండలం హంక్యతండాలో ని 25 డబుల్‌ బెడ్‌రూం ఇ ళ్లకు పట్టాలు అందజేశా రు. డబుల్‌ బెడ్‌రూం పథ కం దేశానికే ఆదర్శమన్నారు. త్వరలోనే సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హంక్యతండాలో రూ.3కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, రూ.20లక్షలతో సీసీ రోడ్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అనంతరం గాగిళ్లపురంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక, రూ.5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను, రూ.4లక్షలతో నిర్మించిన పా ఠశాల ప్రహరీ గోడను, పల్లె ప్రకృతివనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పల్లెప్రగతి తో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ క మిటీ చైర్మన శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సర్వయ్య, ఉపాధ్యక్షులు రాజవర్ధనరెడ్డి, కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ రామకృష్ణ, మోహనకృష్ణ, అనంతగిరి పాల్గొన్నారు. Read more