సీఎం కేసీఆర్‌కు దళితులు రుణపడి ఉంటారు

ABN , First Publish Date - 2022-09-12T04:42:47+05:30 IST

సీఎం కేసీఆర్‌కు దళిత కుటుంబాలు రుణపడి ఉంటాయని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

సీఎం కేసీఆర్‌కు దళితులు రుణపడి ఉంటారు
దళితబంధు పథకంలో మంజూరైన యూనిట్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

రామన్నపేట, సెప్టెంబరు 11: సీఎం కేసీఆర్‌కు దళిత కుటుంబాలు రుణపడి ఉంటాయని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  అన్నారు. మండలంలోని కుంకుడుపాములలో 38మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరైన వివిధ యూనిట్లను ఆదివారం పంపిణీ చేశారు. మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ పాలనను కోరుకుంటు న్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోలేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ నాయకుల ఆటలు ఇక నుంచి సాగవని హెచ్చరించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజ్‌ లేకుండా వంద శాతం సబ్సిడీతో రూ.10లక్షలు ప్రతి దళిత కుటుంబానికీ అందించాలని సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గ్రామంలో రూ.25లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ఆసరా పింఛన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీ జగ న్మోహన్‌, సర్పంచ్‌ బొక్క యాదిరెడ్డి, బొక్క మాధవరెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌  కంభంపాటి శ్రీనివాస్‌, నంద్యాల భిక్షంరెడ్డి, తహసీల్దార్‌ జి.ఆంజనేయులు, ఎంపీడీవో జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more