దళిత పక్షపాతి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-26T06:11:14+05:30 IST

దళిత పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని, వారి అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధు పథకం అమలు చేసి జీవితాల్లో వెలుగు నింపారని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

దళిత పక్షపాతి సీఎం కేసీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌

మర్రిగూడ, సెప్టెంబరు 25 : దళిత పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని, వారి అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధు పథకం అమలు చేసి జీవితాల్లో వెలుగు నింపారని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లను వారు ఆదివారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ దళితులపై నిర్లక్ష్య ధోరణి అవలంభించడం వల్లే నేటికీ వారు బతుకులు మారలేదన్నారు. దళితుల జీవన స్థితిగతులు మెరుగు పరిచేందుకు సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలతో పాటు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో దళితబంధు కమిటీ సభ్యుడు లపంగి నర్సింహ, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ ఊరుపక్క నగేష్‌, ఊరుపక్క భిక్షం, వర్కాల వెంకటేష్‌, అయితగోని వెంకటయ్యగౌడ్‌, ఏర్పుల అంజయ్య, భాస్కర్‌, నాగరాజు, బూరుగు నాగరాజు పలువురు పాల్గొన్నారు. 

Read more