ఐదు క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

ABN , First Publish Date - 2022-09-17T06:29:35+05:30 IST

మండలంలోని రాములపెల్లి ఎక్స్‌ రోడ్డు తండా వద్ద ఎక్సైజ్‌ అధికారులు దాడి చేసి ఐదు క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

ఐదు క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

తుంగతుర్తి, సెప్టెంబరు 14: మండలంలోని రాములపెల్లి ఎక్స్‌ రోడ్డు తండా వద్ద ఎక్సైజ్‌ అధికారులు దాడి చేసి ఐదు క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  కిషన్‌ ఆఽధ్వర్యంలో గురువారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తూ ఐదు క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పట్టిక, 15 లీటర్ల నాటు సారా, కారు, బైకు స్వాధీనం చేసుకుని  ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్లు నాగార్జున, భరత్‌భూషన్‌, ఎస్‌ఐలు శివకుమార్‌, రాఘవేందర్‌ పాల్గొన్నారు. 


Read more