యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-10-02T05:56:47+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ప్రధానాలయంలోని మూలమూర్తుల దర్శనాలు.. ఆర్జిత సేవల నిర్వహణకో సం విచ్చేసిన భక్తులతో క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి
దర్శనాల కోసం తూర్పు రాజగోపురం వద్ద వేచివున్న భక్తులు

యాదగిరిగుట్ట, అక్టోబరు1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ప్రధానాలయంలోని మూలమూర్తుల దర్శనాలు.. ఆర్జిత సేవల నిర్వహణకో సం విచ్చేసిన భక్తులతో క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.  వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.18,18,487 ఆదా యం సమకూరిందని, 9,652 మంది భక్తులు దేవదేవుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరీశుడికి నిత్యపూజలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం అలంకార వెండిజోడు సేవోత్సవం కన్నుల పండువగా కొనసాగింది. యాదగిరికొండపై అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలో స్ఫటికమూర్తులకు నిత్యపూజలు, శరన్నవరాత్రి వేడుకలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి.  

ఆలయ పనులపై సమీక్ష 

నృసింహుడి ఆలయ విస్తరణ పనులపై శనివారం హైదరాబాద్‌లోని మెట్రోభవన్‌లో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్‌అండ్‌బీ అధికారులతో విస్తరణ పనుల పురోగతి, నిర్వహణ తీరుపై సమీక్షించారు. కొండచుట్టూ, రింగురోడ్డు పరిసరాల్లో ఏర్పాటు చేసిన గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్‌ గార్డెన్‌ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌ నాయక్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ అడ్వయిజర్‌ రాజేందర్‌రెడ్డి, జైన్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రతినిధులు సాయిబాబ, ముకుంద్‌ పాల్గొన్నారు.

Read more