ఉనికి కోసమే సీఎం కేసీఆర్‌పై విమర్శలు

ABN , First Publish Date - 2022-09-26T07:09:09+05:30 IST

రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణలేదని, ఉనికి కోసమే సీఎం కేసీఆర్‌పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి విమర్శించారు.

ఉనికి కోసమే సీఎం కేసీఆర్‌పై విమర్శలు
బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 15: రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణలేదని, ఉనికి కోసమే సీఎం కేసీఆర్‌పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని  ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి విమర్శించారు. ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని టౌన్‌హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పద్మావతి దంపతులకు పదవుల పిచ్చి పట్టిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు తనపై కూడా విమర్శలు చేస్తు న్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారని ఆరోపించారు. కార్యక్రమంలో చైర్మన్‌ గెల్లి అర్చన రవి, వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, గాయత్రి భాస్కర్‌, మంజుల, ఫణికుమారి, అమర్‌నాధ్‌రెడ్డి పాల్గొన్నారు. 

అర్హులైన ప్రతీ మహిళకు చీరలు అందిస్తున్నాం

హుజూర్‌నగర్‌ రూరల్‌: అర్హులైన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరలు అందిస్తున్నామని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం,  టౌన్‌హాల్లో మహిళలకు బతు కమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్‌ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారన్నారు. తెలంగా ణలోనే పూలను, ప్రకృతిని పూజిస్తారన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Read more