సీసీ కెమెరాలతో నేరాలు తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-07-05T06:44:10+05:30 IST

సీసీ కెమెరాల నిఘాతో దొంగతనాలు, నేరాల సంఖ్య తగ్గుతుందని డీఎస్పీ నాగేశ్వర్‌రావు అన్నారు.

సీసీ కెమెరాలతో నేరాలు తగ్గుముఖం
సీసీ కెమెరాలు ప్రారంభిస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సర్పంచ సబిత

డీఎస్పీ నాగేశ్వర్‌రావు 

మర్రిగూడ, జూలై 4:  సీసీ కెమెరాల నిఘాతో దొంగతనాలు, నేరాల సంఖ్య తగ్గుతుందని డీఎస్పీ నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని శివన్నగూడ గ్రామానికి చెందిన జాల జంగయ్య జ్ఞాపకార్థం అతని కుమారులు  బిక్షమయ్య, వెంకటయ్య సహకారంతో రూ.2.30లక్షల విలువజేసే సీసీ కెమెరాలను శివన్నగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల నిర్వహణకు మేనేజ్‌మెంట్‌ అవసరానికి దాతలే సహా యం చేయాలని సూచించారు. అంతకుముందు మర్రిగూడ జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి మండలంలో ఏ గ్రామంలోనైనా సీసీ కెమెరాలు అవసరమైతే తను సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఎంపీపీ మెండు మోహనరెడ్డి వట్టిపల్లి గ్రామానికి 8 సీసీ కెమెరాలను అందజేస్తానని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్‌ అంతంపేట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహాయం అందిస్తానని తెలిపారు. శివన్నగూడ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జూనియర్‌ ఊరే రమేష్‌ శివన్నగూడ గ్రామానికి మరో రెండు సీసీ కెమెరాలు అందిస్తానని డీఎస్పీ ముందు వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు అందజేస్తున్నందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ చిట్యాల సబిత యాదగిరిరెడ్డి, సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ దాసరి మమతగోపాల్‌, పల్లె రవికుమార్‌, ప్రశాంత, బొడ్డు రవి, చిట్యాల రంగారెడ్డి, శిశుపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

 ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబ సభ్యులకు పరామర్మ

మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 2వ తేదీన వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న దళిత బాలిక కుటుంబ సభ్యులను సోమవారం దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు పరామర్శించారు.  బాలిక ఏ విధంగా మృతి చెందింది.. కారకులెవరని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన బిడ్డ మృతికి కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ చట్టపరమైన న్యాయం చేస్తామని, నిందితుడిని అరె్‌స్టచేసి కఠినంగా శిక్షిస్తామని హాఈమీ ఇచ్చారు. తెలిపారు. ఆయన వెంట సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ మెండు  మోహనరెడ్డి, కాశయ్య, నర్సింహ ఉన్నారు. 


Read more