గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి

ABN , First Publish Date - 2022-09-30T06:55:39+05:30 IST

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని యుగ తులసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్‌ ప్రశ్నించారు.

గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి

మునుగోడురూరల్‌, సెప్టెంబరు 29: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని యుగ తులసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్‌ ప్రశ్నించారు. గురువారం మండల పరిధిలోని జమస్థాన పల్లి గ్రామంలోని మారమ్మతల్లి దేవాలయానికి రెండు గోవులను దానం చేసి అనంతరం మాట్లాడారు. యుత తులసి పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో గోవులకు పూర్వ వైభవం తెస్తానన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే గోవులను రక్షించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూగ జీవి పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు. మండలానికో గోశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుడికి ఒక గోమాతని పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగానే మారమ్మతల్లి ఆలయానికి రెండు గోవులను బహుకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి ముంత లక్ష్మయ్య, యుగ తులసి పార్టీ సభ్యులు సంగమేశ్వరచారి, ఉప్పునూతల ఉపేందర్‌, కుంభం రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Read more