గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-08-10T05:44:06+05:30 IST

గంధమల్ల రిజర్వాయర్‌ పూర్తయితేనే ఆలేరు ప్రాంతానికి సాగు అందుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు.

గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీరాములు

  సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

 యాదగిరిగుట్ట రూరల్‌, ఆగస్టు 9: గంధమల్ల రిజర్వాయర్‌ పూర్తయితేనే ఆలేరు ప్రాంతానికి సాగు అందుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి మండలం బస్వాపురం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నప్పటికి నీళ్లపై ఆలేరుకు అశ లేదని గందమల్ల రిజర్వాయర్‌ పూర్తి అయితేనే ఆలేరు సస్యశ్యామలమవుతుందని అన్నారు. ఈ ప్రాంతప్రజలు   ఆలేరుకు వచ్చే నీటివాటాను పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23 తేదీల్లో జరిగే పార్టీ 3వ సీపీఐ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణ, బండి జంగమ్మ,  కుసుమాని హరిచంద్ర, ఉప్పల ముత్యాలు, సీపీఐ మండల కార్యదర్శులు జెల్లా జానకిరాములు, అన్నెమో వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.


Read more