ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర

ABN , First Publish Date - 2022-11-28T00:01:48+05:30 IST

ఉపాధి హామీ పథకానికి రద్దు చేసేం దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య విమర్శించారు.

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
మహాసభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ సీతారాములు

మోత్కూరు, నవంబరు 27: ఉపాధి హామీ పథకానికి రద్దు చేసేం దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య విమర్శించారు. మోత్కూరులో ఆది వారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహా సభల్లో వారు మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కోట్లాది మంది గ్రామీణ పేదలకు అన్నం పెడుతోందన్నారు. సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని, రోజు కూలి రూ.600 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తొలత వ్యవసాయ కూలి రాచకొండ రాములమ్మ జెండా ఆవి ష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, గంగదేవి సైదులు, మామిడి, కొండ మడుగు నర్సింహ, ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి. జహంగీర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేషం, జెల్లల పెంటయ్య, జూకంటి పౌల్‌, పల్లెర్ల అంజయ్య, సల్లూరి కుమార్‌, సర్పంగి స్వామి పాల్గొన్నారు. రాజ్యాంగం, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధాని మోదీకిగాని, బీజేపీ నాయకులకుగాని లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీ తారాములు విమర్శించారు. మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రధాని మోదీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ప్రజలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, అప్పుడే దేశం బాగుపడతుందని చెప్పడం కంచె చేను మేసిన చందంగా ఉందన్నారు.

Updated Date - 2022-11-28T00:01:51+05:30 IST