కాన్షిరాం ఆశయాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-03-16T05:38:54+05:30 IST

కాన్షిరాం ఆశయాలు సాధించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు అన్నారు. కాన్షిరాం 88వ జయంతిని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం నివాళులర్పించారు. ప్రస్తు

కాన్షిరాం ఆశయాలు సాధించాలి
మిర్యాలగూడలో కాన్షీరాం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

మిర్యాలగూడ,/ దేవరకొండ మార్చి 15: కాన్షిరాం ఆశయాలు సాధించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు అన్నారు. కాన్షిరాం 88వ జయంతిని పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం నివాళులర్పించారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కాన్షిరాం మార్గం ఆచరణీయం కావాలని అభిలాసించారు. కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు అంకెపాక కోటేష్‌, నాయకులు నాగేశ్వర రావు, విశ్వనాధ్‌, రమేష్‌, దినేష్‌, అజయ్‌, నాగమణి, రాణి, శోభ పాల్గొన్నారు. దేవరకొండలో కాన్షిరాం చిత్రపటానికి బీఎస్పీ దేవర కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి రమావత్‌ రమేష్‌నాయక్‌ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులర్పించిచారు. కార్యక్రమంలో బీఎస్పీ నా యకులు ఎర్ర కృష్ణ, మహిళ కన్వీనర్‌ సహని, కొట్టెపాక మురళికృష్ణ, హనుమానాయక్‌, యాదయ్య, శ్రీకాంత్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 


Read more