మట్టపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-27T06:24:58+05:30 IST

రెండో యాదగిరిగుట్టగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీ న రసింహా స్వామి మహాక్షేత్రంలో నాలుగు రోజులుగా కొనసాగిన పవిత్రోత్సవాలు సోమవా రం మధ్యాహ్నం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి.

మట్టపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు
శాంతి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

మఠంపల్లి, సెప్టెంబరు 26: రెండో యాదగిరిగుట్టగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీ న రసింహా స్వామి మహాక్షేత్రంలో నాలుగు రోజులుగా కొనసాగిన పవిత్రోత్సవాలు సోమవా రం మధ్యాహ్నం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఉదయం మూలవరులు, ఉభ య దేవేరులతో పాటు పరివార దేవతలు, ఆలయ శిఖరాలకు ధారణ చేసిన పవిత్రాల ను విసర్జన చేశారు. సప్తాదశ(17) కుండాల నుంచి పుణ్యజలాలు సేకరించి స్వామి వారి కి, జీవధ్వజానికి సంప్రోక్షణ చేశారు. సర్వనదీ తీర్థాలతో అభిషేకాలు క్రతువులు, శాంతి కల్యాణం నిర్వహించారు. నిత్యకైంకర్యాలు, మహర్నివేదనలు పూర్తయ్యాక భక్తజనులకు శేష పవిత్రాలను వితరణ చేశారు. బీవీ వాసుదేవాచార్యులు నేతృత్వంతో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండనవీన్‌, అర్చకులు పద్మనాభాచార్యులు, టి.శ్రీనివాసచార్యులు, టి.కృష్ణమాచార్యులు, టి.రామాచార్యులు, అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, బ్రహ్మచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T06:24:58+05:30 IST