కాంగ్రెస్‌ విజయానికి కృషిచేయాలి : జానారెడ్డి

ABN , First Publish Date - 2022-12-30T00:46:36+05:30 IST

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలంతా పట్టుదలతో పనిచేసి పార్టీ విజయానికి కృషిచేయాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ విజయానికి కృషిచేయాలి : జానారెడ్డి
పెద్దవూరలో మాట్లాడుతున్న సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డి

పెద్దవూర, డిసెంబరు 29: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలంతా పట్టుదలతో పనిచేసి పార్టీ విజయానికి కృషిచేయాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్‌హాల్‌లో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉండడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిందన్నారు. అప్పుడు బీఆర్‌ఎస్‌కు ఉన్న రెండు ఎంపీ స్థానాలతో రాలేద న్నారు. తెలంగాణ తెచ్చామని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపిందన్నారు. వివిధ పథకాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టి అధికారం చేపట్టాలని బీఆర్‌ఎస్‌ చూస్తోందని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్‌, మైనార్టీ రిజర్వేషన్లను పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నిం చారు. ఇల్లు కట్టుకుంటే రూ.5లక్షలు ఇస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు స్థలం ఉంటే రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. చేసిన పనికి బిల్లులు రాక కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టే పథ కాలను ఎలా అమలు చేస్తారన్నారు. జనవరి 26న రాహుల్‌గాంధీ సందేశ పత్రాలను గ్రామగ్రామాన ప్రజలకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుమ్మ లపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, త్రిపురారం జడ్పీటీసీ భారతిబాయి భాస్కర్‌నాయక్‌, నాయకులు గోపగాని మాధవి, గిరి, కిలారి మురళీయాదవ్‌ పాల్గొన్నారు.

ఆయకట్టు చివరి భూములకు నీరందించాలి

మిర్యాలగూడ: సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టు భూములకు సాగునీరు సరఫరా చేయాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ కోరారు. కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌పీ క్యాంపు కార్యాలయంలో డీఈ సంపత్‌ని కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారబందీ కింద జనవరి 2వ తేదీ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేస్తున్నందున చివరి భూములకు నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఆయకట్టులో ముమ్మరంగా యాసంగి వరినాట్ల కార్యక్రమం కొనసాగుతున్నందున నీరు అందకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం వుందన్నారు. జనవరి నెల చివరి వరకు ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేసి రైతులు సకాలంలో వరి నాట్లు పూర్తి చేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పొదిల శ్రీనివాస్‌, బసవయ్య, బక్కారెడ్డి, సలీం, మెరుగు శ్రీనివాస్‌, కోట శ్రీనివాసరావు, రవినాయక్‌, నాగునాయక్‌, ఎండి. గౌస్‌, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:46:36+05:30 IST

Read more