Congress meeting: నల్గొండ: చండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ నేడు

ABN , First Publish Date - 2022-08-05T14:16:03+05:30 IST

చండూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ (Congress meeting) జరగనుంది.

Congress meeting: నల్గొండ: చండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ నేడు


నల్గొండ (Nalgonda): చండూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ (Congress meeting) జరగనుంది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరు కానున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసందే. దీంతో కాంగ్రెస్ క్యాడర్ భరోసా సభకు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. మాజీ సీఎల్పీ జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటి వెంకట్ రెడ్డి సభకు దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు శుక్రవారం ఢిల్లీలో ముఖ్య నేతల సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి రేవంత్‌తో కలిసి మునుగోడు బహిరంగ సభకు రానున్నారు.

Updated Date - 2022-08-05T14:16:03+05:30 IST