వర్షపు జల్లులతో రైతుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2022-12-12T01:05:32+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు పైరవీకారుల ధాన్యాన్ని మాత్రమే కాంటా వేస్తు ్తన్నారు. తమ ధాన్యాన్ని కాంటా వేయమని సామాన్య రైతులు నిర్వాహ కుల కాళ్లావేళ్లా పడుతున్నా కనికరించటంలేదు. దీంతో సామాన్య రైతుల ధాన్యం నెలల తరబడి కేంద్రాల్లోనే ఉన్నాయి.

వర్షపు జల్లులతో రైతుల్లో ఆందోళన
వర్షం కురుస్తున్నందున మోతె మండల కేంద్రంలో ధాన్యం రాశులపై రైతులు కప్పిన పట్టాలు

మిల్లులకు చేరితేనే గుండె నిబ్బరం

మోతె, డిసెంబరు 11: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు పైరవీకారుల ధాన్యాన్ని మాత్రమే కాంటా వేస్తు ్తన్నారు. తమ ధాన్యాన్ని కాంటా వేయమని సామాన్య రైతులు నిర్వాహ కుల కాళ్లావేళ్లా పడుతున్నా కనికరించటంలేదు. దీంతో సామాన్య రైతుల ధాన్యం నెలల తరబడి కేంద్రాల్లోనే ఉన్నాయి. దీంతో తుపాను ప్రభావంతో నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై నాలుగు రోజులుగా వర్షపు జల్లులు కురుస్తున్నందున రైతులు ఆందోళనతో ఉన్నారు.

కొనుగోళ్లలో జాప్యం

మోతె మండలంలో 10 ఐకేపీ కేంద్రాలు, సహకార సొసైటీల ఆధ్వ ర్యంలో రెండు (రాఘవాపురం క్రాస్‌రోడ్‌, ఉర్లుగొండ వద్ద) ధాన్యం కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 రోజులుగా కాంటాలు వేయలేదు. లారీలు రానందున కాంటాలు వేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచారు. టార్పాలిన్‌ పట్టాలు కప్పినా కింద నుంచి నీటి చెమ్మతో ధాన్యం తడుస్తున్నాయని రైతులు తెలిపారు.

గతంలో ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనైనా విక్రయించే సౌలభ్యం రైతులకు ఉండేది. ప్రస్తుతం ఏ కేంద్రం పరిధిలో ఉన్న గ్రామ రైతులు ఆ కేంద్రాల్లోనే విక్రయించాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చినం దున రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతులు పైరవీకారులను, వీబీకేలను ఆశ్రయిస్తున్నారు.

నిల్వ ఉన్న ధాన్యం

గతంలో టార్పాలిన్లను సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చేది. ప్రస్తుతం పట్టాలు లేనందున వర్షం తాకిడికి భయపడి అధిక ధరను చెల్లించి రైతులు టార్పాలిన్లను అద్దెకుతీసుకుంటున్నారు. దీనికి తోడు సూర్యా పేట–ఖమ్మం రహదారి రోడ్ల వెంబడి ధాన్యం పోయడంతో వర్షం వస్తే వరదకు కిందకు కొట్టుకుపోతున్నాయి. మండలంలో 29 గ్రామాలు ఉండగా సుమారు 8వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అత్యధికంగా నామవరం, సిరికొండ, రావిపహడ్‌, విభలాపురం, తుమ్మగూడెం, నేరేడువాయి, ఉరు ్లగొండ గ్రామాల్లో వరి సాగు చేశారు. గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఐకేపీ ద్వారా 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 10 కేంద్రాల్లో 81,865 క్వింటాళ్ల ధాన్యాన్ని 1574మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇంకా కేంద్రాల్లో 15లారీల లోడులకు పైబడి ధాన్యం ఉంది. సిరికొండ సొసైటీ ఆధ్వ ర్యంలో రాఘవాపురం క్రాస్‌రోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సర్వారం సొసైటీ ద్వారా ఉర్లుగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏ చిన్నపాటి వర్షం కురిసినా నామవరం, మామిళ్లగూడెం, ఉర్లుగొండ గ్రామాల్లోని కేంద్రాల్లోకి వరద చేరే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు.

మిల్లులకు చేర్చడంలో అలసత్వం

సిరికొండ, లాల్‌తండ, భల్లుతండ, భీక్యాతండ, రాఘవాపురం క్రాస్‌ రోడ్‌, రాఘవాపురం గ్రామాలతో పాటు మరో నాలుగు ఆవాసాలు ఉన్న గ్రామాలన్నింటినీ కలిపి ఒకే కేంద్రం ఏర్పాటు చేయడంతో ధాన్యం విక్ర యానికి రైతులకు నెలలు పడుతోంది. కాంటాలు వేసినా బస్తాలు మిల్లులకు చేర్చడంలో నిర్వాహకులు అలసత్వం వహిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాల తూకంలో మోసం, బస్తాకు ఒకటి/రెండు కిలోల చొప్పున తరుగు, కాంటాలు వేయకుండా జాప్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారం భించి నెలరోజులైనా ధాన్యం కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు ఇంకా ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాలి

దిగుబడులకు తగిన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం పెంచాలి. సంఘబంధం సభ్యు లతో పాటు అధికారులు పర్యవేక్షణ చేయనందున నెలల తరబడి కేంద్రాల్లోనే ధాన్యం ఉంది. 29 గ్రామా లకు 12కేంద్రాలు ఏర్పాటు చేయడమేంటని అధికారులను నిలదీసినా ఫలితం కనబడలేదు. రైతులను ఇబ్బంది పెడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు కొనుగోలు కేంద్రాలు పెంచాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా.

- దుశ్చర్ల సత్యనారాయణ, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు

కాంటాలు వేస్తున్నాం

అధికారులు సూచించిన గ్రామాల్లో ధాన్యం కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. సంఘబంధం సభ్యులు, వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ప్రతీ రోజు కాంటాలు వేస్తున్నాం. తూకాల్లో మోసం, అధి కంగా వసూలు చేస్తే అధికారులు ఫిర్యాదు చేయాలి. కాంటా వేసిన ధాన్యం బస్తాలను, లారీలు వచ్చిన వెంటనే సీరియల్‌ ప్రకారం మిలు ్లలకు పంపిస్తున్నాం. టార్పాలిన్లను ప్రభుత్వం పంపిణీ చేయనందున రైతులకు ఇవ్వలేకపోతున్నాం.

  • వెంకయ్య, ఏపీఎం, మోతె

Updated Date - 2022-12-12T01:05:32+05:30 IST

Read more