మల్లన్నసాగర్‌ తరహాలోనే పరిహారం అందించాలి

ABN , First Publish Date - 2022-06-12T06:37:53+05:30 IST

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు తరహాలోనే చర్లగూ డెం రిజర్వాయర్‌ భూనిర్వాసితులకు పరిహారం అందించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు.

మల్లన్నసాగర్‌ తరహాలోనే పరిహారం అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం

 సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం 

మర్రిగూడ, జూన 11: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు తరహాలోనే చర్లగూ డెం రిజర్వాయర్‌ భూనిర్వాసితులకు పరిహారం అందించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో చర్లగూడెం రిజర్వాయర్‌ ను ప్రారంభించి నేటికి ఏడున్నరేళ్లు అవుతున్నా నిర్వాసితులకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో వెంకెపల్లి, వెంకెపల్లితండా, చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నాలుగు గ్రామాలు చర్లగూడెంలో ముంపునకు గురైనందున సర్వం కోల్పోయి నిరాశ్రయుల య్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం అందించకుండా తరచూ జీవోలు మారుస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. పరిహారం కోసం భూనిర్వాసితులు 32 రోజులు గా ధర్నా చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు తరహాలోనే ఈ ప్రాంత భూనిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చే శారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి బిక్షంరెడ్డి, ఆకుల రఘుమయ్య, బూడిద సురేష్‌, గిరి, నిరంజన తదితరులు పాల్గొన్నారు. 

పరిహారం ఇస్తేనే పనులకు సహకరిస్తాం : నిర్వాసితులు 

పరిహారం ఇస్తేనే చర్లగూడెం రిజర్వాయ ర్‌ ప్రాజెక్టు పనులకు సహకరిస్తామని చర్లగూడెం ముంపు గ్రా మ నిర్వాసితులు పే ర్కొన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భా గంగా చర్లగూడెం రిజర్వాయర్‌ వద్ద భూనిర్వాసితులు చేస్తున్న ధర్నా 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ పరిహారం అందించాలని ధ ర్నా చేస్తున్నా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. సర్వం కోల్పోయామని, కూలీలుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మాకు పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ అందించి పనులు కొనసాగించాలని కోరారు. Read more