పరిహారం, పునరావాసం కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-15T05:52:48+05:30 IST

కిష్టరాయనపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించేంత వరకు పనులు నిలిపివేస్తామని నాంపల్లి మండలం లక్ష్మణాపురం ముంపు బాధితులు హెచ్చరించారు.

పరిహారం, పునరావాసం కల్పించాలి

మర్రిగూడ, ఆగస్టు 14: కిష్టరాయనపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించేంత వరకు పనులు నిలిపివేస్తామని నాంపల్లి మండలం లక్ష్మణాపురం ముంపు బాధితులు హెచ్చరించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టరాయనపల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన కట్ట పనులను జరగకుండా ఆదివారం నిర్వాసితులు అడ్డుకున్నారు. రెండు రోజుల నుంచి పనులు జరగకుండా నిర్వాసితులు అక్కడే వంటావార్పు చేసుకొని రాత్రివేళలో బస చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ హామీలను అమలు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని అన్నారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. లే నిచో పనులు జరగకుండా నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణాపురం గ్రామస్థులు పాల్గొన్నారు. 

Read more