కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులు

ABN , First Publish Date - 2022-09-12T05:18:41+05:30 IST

నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని చేపట్టారని, కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.

కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులు
గుండ్రాంపల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, నాయకులు

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

చిట్యాలరూరల్‌, సెప్టెంబరు 11: నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని చేపట్టారని, కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఆదివారం సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారని, అందులో వందలాది మంది అమరులయ్యారన్నారు. గుండ్రాంపల్లి చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్‌, బొల్గూరి నర్సింహ, గురిజ రామచంద్రం, టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read more