రంగుల కేళీ.. రంగోలి

ABN , First Publish Date - 2022-03-18T06:45:42+05:30 IST

‘హోలీ హోలీల రంగహోలీ చెమ్మకేలీల హోలీ.వరుసలేని కాముడమ్మ హోలీ చెమ్మకేలీల హోలీ. ఊరూరా తిరిగిండు హోలీ, మీ ఇంటికి వచ్చాడు హోలీ..’ అంటూ మహిళలు వాడవాడనా తిరుగుతూ సందడి చేస్తున్నారు. చిన్నా రులు కోలాటాలతో పాటలు ఇల్లిల్లూ తిరుగుతున్నారు.

రంగుల కేళీ.. రంగోలి

నేడు హోలీ సంబురాలు

కోలాహలంగా మహిళలు, పిల్లల సందడి


నల్లగొండ కల్చరల్‌, భువనగిరి టౌన్‌: ‘హోలీ హోలీల రంగహోలీ చెమ్మకేలీల హోలీ.వరుసలేని కాముడమ్మ హోలీ చెమ్మకేలీల హోలీ. ఊరూరా తిరిగిండు హోలీ, మీ ఇంటికి వచ్చాడు హోలీ..’ అంటూ మహిళలు వాడవాడనా తిరుగుతూ సందడి చేస్తున్నారు. చిన్నా రులు కోలాటాలతో పాటలు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. గత సంవత్సరం కరో నాతో హోలీని భయం.. భయంగా జరుపుకున్న ప్రజలు ఈసారి వేడుకగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు.


ప్రకృతి పచ్చదనంతో పరిఢ విల్లుతోంది. ఎండాకాలం ప్రారంభానికి హోలీ పండుగ ఓ చిహ్నం.  కరోనా తగ్గుముఖం పట్టడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు ఆట, పాటలతో సందడి చేస్తున్నారు. పాఠశాలలకు తాత్కాలికంగా సెలవు ప్రకటించడంతో బాల, బాలికలు మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండానే ఇంటింటికీ తిరుగుతున్నారు. గత సంవత్సర కరోనా కారణంగా హోలీ పండుగను రద్దుచేయగా, ప్రస్తుతం ఆంక్షలు ఏమీ లేకపోవడంతో ఈ నెల 11వ తేదీ నుంచి హోలీ సంబురాలు మొదలయ్యాయి. ఆ రోజు సాయంత్రం నుంచే చిన్నారులు బృందాలుగా ఏర్పడి కోలాటం ఆడుతూ ఇంటింటికీ తిరుగుతూ కానుకలు స్వీకరిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులపాటు కోలాటాలు, ఆటపాటలతో సంబురంగా ఉత్సవాలు జరుపుకున్నారు. కాముడి దహనం అనంతరం మరుసటి రోజున హోలీ పండుగను ఘనంగా జరుపుకునే ఆనవాయితీ ఉంది.  


హోలీ వేడుకలకు సర్వంసిద్ధం 

హోలీ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. శుక్రవారం జరుపుకునే పండుగకు రంగులను కొనుగోలు చేశారు. వీధి వీధిన ర్యాలీలు నిర్వహించేందుకు యువత ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో గురువారమే విద్యాసంస్థలు, కార్యాలయాల్లో హోలీ నిర్వహించారు. రంగులను చల్లుకున్నారు. అలాగే గురువారం రాత్రి ఉత్సాహంగా కామదహనంచేశారు. బస్తీలలో డప్పు చప్పుళ్లతో అర్థరాత్రి వరకు కామ దహనం, ఊరేగింపులు నిర్వహించారు. హోలీ నేపఽథ్యంలో జిల్లా పరిధిలోని వైన్స్‌, బార్లు గురువారం సాయంత్రం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు మూసివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు : మంత్రి

నల్లగొండ రూరల్‌: జిల్లా ప్రజలకు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హోలీ వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని, అందరి జీవితం రంగులమయం కావాలనికాంక్షించారు. 

Read more