ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి వరం

ABN , First Publish Date - 2022-09-08T06:14:20+05:30 IST

ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి వరంలాంటిదని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సీఎం సహాయనిధి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు బుధవారం జిల్లా కేంద్రంలోని

ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి వరం
సీఎం రిలీ్‌ఫఫండ్‌ చెక్కును అందజేస్తున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటటౌన్‌, సెప్టెంబరు 7 : ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి వరంలాంటిదని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సీఎం సహాయనిధి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనంలో పంపిణీ చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సపొందిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా 335 మందికి కోటి 45లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌, కౌన్సిలర్‌ గండూరి ప్రవళికప్రకాష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు,  మండల, పట్టణ టీఆర్‌ఎ్‌సనాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎ.రమే్‌షకుమార్‌ మంత్రి జగదీ్‌షరెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. ఆల్‌ఇండియా బంజారా సేవాసంఘం జిల్లా నూతన కమిటీ సభ్యులు మంత్రి జగదీ్‌షరెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా వారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ధారవత్‌ బాబునాయక్‌, వాంకుడోతు వెంకన్ననాయక్‌, పాండునాయక్‌, బిక్షంనాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-08T06:14:20+05:30 IST