గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

ABN , First Publish Date - 2022-02-19T06:15:53+05:30 IST

గిరిజన సంక్షేమాని కి సీఎం కేసీఆర్‌ కృషి చే స్తున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు.

గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, ఫిబ్రవరి 18: గిరిజన సంక్షేమాని కి సీఎం కేసీఆర్‌ కృషి చే స్తున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాం పు కార్యాలయంలో నిర్వ హించిన సమీక్షా సమావే శంలో ఆయన మాట్లాడా రు. దేవరకొండలో ఈ నె ల 21న సద్గురు సంతు సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జయంతి సందర్భంగా నియోజకవర్గానికి రూ.3.15 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. లంబాడా జాతిలో పూజలు చేసే విధానాన్ని అమలులోకి తేవడంతో పాటు గిరిజనుల జాతిని జాగృతం చేసిన మహనీయుడు సంతుసేవాలాల్‌ మహారాజ్‌ అన్నారు. సేవాలాల్‌ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ ఆర్డీవో గోపిరాం, ఎంపీపీ జానయాదవ్‌, సునిత జనార్ధనరావు, పార్వతి, జడ్పీటీసీలు మారేపాకల అరుణ సురే్‌షగౌడ్‌, కేతావత బాలునాయక్‌, గిరిజన సంఘం నాయకులు కేతావత లక్ష్మణ్‌నాయక్‌, పాపనాయక్‌, శంకర్‌నాయక్‌, పంతులాల్‌, నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. Read more