గురుకులాల బలోపేతానికి సీఎం కృషి

ABN , First Publish Date - 2022-09-08T06:26:41+05:30 IST

గురుకుల పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు.

గురుకులాల బలోపేతానికి సీఎం కృషి
త్రిపురారంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భగత్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి

హాలియా, సెప్టెంబరు 7: గురుకుల పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం అనుముల ఎస్సీ గురుకుల పాఠశాలలో బుధవారం జరిగిన స్వచ్ఛ గురుకుల కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో  కలిసి పాఠశాలలోని పరిశుభ్రం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల అభ్యు న్నతికి గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించిన ఘనత సీఏం కేసీఆర్‌కే దక్కుతు ందన్నారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, పరిర క్షణ వంటి విషయాలపై అవగాహన పెంచు కోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీవైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఎంపీపీ సుమతి పురుషోత్తం, ఎంపీటీసీ కొండ రమేష్‌, నాగా ర్జునరెడ్డి, అబ్దుల్‌ హలీం, అంజాద్‌ఖాన్‌, హెచ్‌ఎం రవికుమార్‌  ఉన్నారు. 

త్రిపురారం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భగత్‌ త్రిపురారం మండలకేంద్రంలో బుధవారం ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రమీల, ఎంపీడీవో మంగమ్మ, పంచాయతీ  కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బహునూతల నరేందర్‌, నాయకులు చంద్రారెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, జానయ్య, ధనలక్ష్మి, భరత్‌రెడ్డి, శ్యాసుందర్‌రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-08T06:26:41+05:30 IST