సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-27T06:23:54+05:30 IST

జిల్లా ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చే దరఖాస్తులను పరిశీలించిన ఎన్ని రోజుల్లో పరిష్కారం స్పష్ట త ఇవ్వాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ సం బంధిత అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని మాట్లాడారు.

సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌


సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 26: జిల్లా ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చే దరఖాస్తులను పరిశీలించిన ఎన్ని రోజుల్లో పరిష్కారం స్పష్ట త ఇవ్వాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ సం బంధిత అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని మాట్లాడారు. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోవడం తో వారు కలెక్టరేట్‌కు వస్తున్నారని అన్నారు. సం బంధిత అధికారులు అందుబాటులో లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ప్రజల దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. ప్రజావాణికి హాజరుకానీ ట్రెజరీ, విద్యుత్‌, పశుసంవర్దకశాఖ అధికారులకు మెమోలు జారీ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో శ్రీదేవి, సూపరింటెండెం ట్లు పులి సైదులు, సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


ఎంకేరెడ్డి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి

జిల్లా కేంద్రంలోని మారం కేతన్‌రెడ్డి కళాశాల(ఎంకేరెడ్డి) గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు వీరబోయిన లింగయ్యయాదవ్‌, బారి అశోక్‌, గుండాల సందీప్‌, తగుళ్ల జనార్దన్‌, నిద్ర సంపత్‌నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కళాశాల భవనం పైనుంచి ఓ విద్యార్థిని కిందపడిన ఘటనపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌చేశారు.


కనీస వేతనాలను సవరించాలి

షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, ఐఎ్‌ఫటీయూ జిల్లా నాయకుడు మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మామిడి సుందరయ్య, సాయికుమార్‌, లతీఫ్‌, రాజు, రాఘవరెడ్డి పాల్గొన్నారు. 


ప్రపంచ పర్యాటక వేడుకలు ఘనంగా నిర్వహించాలి

జిల్లాలో ప్రపంచ పర్యాటక వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలో శివాలయం వద్ద మంగళవారం సాయంత్రం 4 గంటలకు పర్యాటక వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


బిందుసేద్యంతో సాగు మేలు

మోతె: బిందుసేద్యంతో పంటలు సాగుచేస్తే రైతులకు మే లు కలుగుతుందని కలెక్టర్‌ పాటిల్‌ కేశవ్‌ హేమంత్‌ అన్నారు. మండల పరిధిలోని రావిపహడ్‌లో బిందు సేద్యంతో సాగవుతున్న ఆయిల్‌పామ్‌, అధిక సాంద్రతతో సాగవుతున్న పత్తి  పంటలను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌, ఏఈవో కార్తీక్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు శ్రీధర్‌గౌడ్‌, కన్న జగన్‌, శశికుమార్‌, సందీప్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T06:23:54+05:30 IST