బూరుగుపల్లిలో చిన్నమేడారం జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2022-02-16T06:45:07+05:30 IST

మండలంలోని బూరుగుపల్లిలో చిన్నమేడారం జాతర మంగళవారం బోనాలతో ప్రారంభమైంది. జిల్లాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయంలోని దేవతలకు బూర్గుపల్లి, కుర్రారం గ్రామస్థులు బోనాలు సమర్పించారు.

బూరుగుపల్లిలో చిన్నమేడారం జాతర ప్రారంభం
బూరుగుపల్లి నుంచి బోనాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు

రాజాపేట, ఫిబ్రవరి 15: మండలంలోని బూరుగుపల్లిలో చిన్నమేడారం జాతర మంగళవారం బోనాలతో ప్రారంభమైంది. జిల్లాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయంలోని దేవతలకు బూర్గుపల్లి, కుర్రారం గ్రామస్థులు బోనాలు సమర్పించారు. బూర్గుపల్లి నుంచి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామస్తు లు వచ్చి ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అదే విధంగా కుర్రారంలో కట్టమైసమ్మకు పూజలు నిర్వహించి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. ముందుగా ఆల య పూజారులు ఎల్లమ్మకు బోనం పెట్టి నైవేద్యం సమర్పించారు. జాతరకు నిర్వాహకులు ముమ్మరం ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్‌, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పటికే జాతర ప్రాంగణానికి చేరుకుంటున్నారు. జాతర కోసం 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. బొందుగుల, కుర్రారం వైపు వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. జాతరలో హోటళ్లు, చికెన్‌, మటన్‌ దుకాణాలతో పాటు వివిధ దుకాణాలు వెలిశాయి.  రంగుల రాట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


నేడు గద్దెనెక్కనున్న సారలమ్మ ..

మండలంలోని చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ గద్దెనెక్కనుంది. కుర్రారం వైపు ఉన్న ఏదులగుట్ట నుంచి సారలమ్మలను ఆలయ పూజారులు తీసుకురానున్నారు. 

Read more