ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూళ్లలో చౌటుప్పల్‌ ముందంజ

ABN , First Publish Date - 2022-07-19T05:02:34+05:30 IST

ఆన్‌లైన్‌లో ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ, ఫీజు వసూళ్లలో చౌటుప్పల్‌, భువనగిరి మునిసిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ముం దంజలో ఉన్నాయి. ఇప్పటి వరకు చౌటుప్పల్‌ మునిసిపాలిటీ 229 లైసెన్స్‌లు మంజూరుచేసి రూ.1,02,03,332 ఫీజు వసూలుతో రాష్ట్రంలో ప్రథ మ స్థానంలో నిలిచింది.

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూళ్లలో చౌటుప్పల్‌ ముందంజ

రూ.1.2కోట్లు వసూలుచేసిన మునిసిపాలిటీ

రూ.91లక్షలతో రెండో స్థానంలో భువనగిరి

ఫీజు గరిష్ఠంగా రూ.2లక్షలకే పరిమితం చేస్తూ తాజాగా ఉత్తర్వులు

రిఫండ్‌చేస్తే పురపాలికలకు తగ్గనున్న ఆదాయం


భువనగిరి టౌన్‌, జూలై 18: ఆన్‌లైన్‌లో ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ, ఫీజు వసూళ్లలో చౌటుప్పల్‌, భువనగిరి మునిసిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ముం దంజలో ఉన్నాయి. ఇప్పటి వరకు చౌటుప్పల్‌ మునిసిపాలిటీ 229 లైసెన్స్‌లు మంజూరుచేసి రూ.1,02,03,332 ఫీజు వసూలుతో రాష్ట్రంలో ప్రథ మ స్థానంలో నిలిచింది. భువనగిరి మునిసిపాలిటీ 978 లైసెన్స్‌లు మం జూరుచేసి రూ.91,73,402 ఫీజు వసూలుతో ద్వితీయ స్థానంలో ఉంది. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని ఓ ఫార్మా కంపెనీ రూ.88లక్షలు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుగా చెల్లించగా, భువనగిరి మునిసిపాలిటీలోని ఏజీఐ గ్లాస్‌ ఫ్యాక్టరీ రూ.62.50లక్షలు చెల్లించింది. ఈ రెండు మునిసిపాలిటీల పరిధిలోని మరికొన్ని పరిశ్రమలు, హోటల్స్‌ రూ.2లక్షల నుంచి రూ.8లక్షల వర కు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాయి. దీంతో ఈ రెండు మునిసిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. మిగతా మునిసిపాలిటీలు సైతం స్థానిక బడా పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి నిబంధనల మేరకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు చేసేందుకు సంబంధిత యాజమాన్యాలపై ఒత్తిడి పెంచాయి. ఇదిలా ఉండగా, భారీ మొత్తంలో ట్రేడ్‌ లైసె న్స్‌ ఫీజు వసూలుపై చౌటుప్పల్‌ ఫార్మా కంపెనీ, భువనగిరి గ్లాస్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేప థ్యంలో ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును గరిష్ఠంగా రూ.2లక్షలకు పరిమితం చేస్తూ మునిసిపల్‌ రాష్ట్ర పరిపాలనా విభాగం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే భారీగా చెల్లించిన ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు రిఫండ్‌పై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఫీజును రిఫండ్‌చేస్తే మునిసిపాలిటీల ఆదాయానికి భారీగా గండి పడనుంది.


బిల్లులు చెల్లించకుంటే నేటి నుంచి నల్లా కనెక్షన్ల కట్‌

బకాయి పడిన నల్లా బిల్లు చెల్లించకుంటే మంగళవారం నుంచి కనెక్ష న్‌ కట్‌ చేసేందుకు భువనగిరి మునిసిపాలిటీ యంత్రాంగం సిద్ధమైంది. మునిసిపాలిటీలో నల్లా బిల్లుల బకాయి సుమారు రూ.3కోట్ల వరకు ఉం ది. వీటి వసూలుకు మునిసిపల్‌ యంత్రాంగం ఈ నెల 1 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు రూ.31,31,200 వసూలయ్యాయి. మిగతా బకాయిల వసూలుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బిల్లు చెల్లించని వినియోగదారుల నల్లా కనెక్ష న్లు మంగళవారం నుంచి తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బిల్‌ కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ బి.నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read more