రేపటి నుంచి కేంద్ర బృందం పర్యటన
ABN , First Publish Date - 2022-07-05T06:03:17+05:30 IST
జలశక్తి పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి కేంద్ర బృందం జిల్లాలో పర్యటిస్తుందని కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్‌తో కలిసి కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జలశక్తి అభియాన్పథకం ద్వారా చేపట్టిన పనులను శాఖల వారీగా నివేదికలు ఇవ్వాల న్నారు.

సూర్యాపేట(కలెక్టరేట్), జూలై 4: జలశక్తి పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి కేంద్ర బృందం జిల్లాలో పర్యటిస్తుందని కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్‌తో కలిసి కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జలశక్తి అభియాన్పథకం ద్వారా చేపట్టిన పనులను శాఖల వారీగా నివేదికలు ఇవ్వాల న్నారు. కేంద్ర బృందం పరిశీలించే ప్రాంతాల్లో ఇన్చార్జిలను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర బృందం గడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రా న్ని సందర్శిస్తుందని తెలిపారు. రెండో రోజు చివ్వెంల, మోతె మండలాల్లో జలవనరుల సంరక్షణ పనులు పరిశీలిస్తారని తెలిపారు. మూడో రోజు మునగాల మండలంలో పర్యటన ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్, డీఆర్డీవో సుందరి కిర ణ్‌కుమార్, డీపీవో యాదయ్య, డీఏవో రామారావునాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, పీఆర్ ఈఈ శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
వర్షాలు కురుస్తున్నందున గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావుతో కలిసి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వర్షాకాలం సీజన్లో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యాధికారులు స్థానికంగా ప్రజలకు అం దుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. భూ సమస్యల ఫిర్యాదులపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలోఏవో శ్రీదేవి, పర్యవేక్షకులు పులి సైదులు, సుదర్శన్‌రెడ్డి, డీఎ్‌సవో విజయలక్ష్మి, డీఏవో రామారావునాయక్, ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ బి.శిరీ ష, డీఆర్డీవో కిరణ్‌కుమార్, డీటీడబ్ల్యూవోశంకర్ తదితరులు పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించాలి
పెన్‌పహాడ్: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించని వారి పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించా రు. మండలంలోని గాజులమల్కాపురం, అనంతారం గ్రామాల్లో సోమవా రం పర్యటించారు. శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యా ర్డులు, వన నర్సరీలు, మెగా పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. ఎండి న మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని అధికారులకు సూచించారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేష్, డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్, ఎంపీడీవో వెంకటచారి, ఎంపీవో నరేష్, సర్పంచ్ బండి ధనమ్మ, ఎంపీటీసీ మామిడి రేవతి, ఏపీవో రవి, ఈసీ ఏకస్వామి పాల్గొన్నారు.