ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర : జూలకంటి

ABN , First Publish Date - 2022-09-25T05:58:11+05:30 IST

పోరాటాల ఫలితం గా వచ్చిన జాతీయ గ్రా మీ ణ ఉపాధిహామీ చట్టాన్ని ని ర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుం ద ని రైతు సంఘం రాష్ట్ర నా యకుడు, సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర : జూలకంటి
మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

దామరచర్ల, సెప్టెంబ రు 24: పోరాటాల ఫలితం గా వచ్చిన జాతీయ గ్రా మీ ణ ఉపాధిహామీ చట్టాన్ని ని ర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుం ద ని రైతు సంఘం రాష్ట్ర నా యకుడు, సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగా ణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వం వేసవి అలవెన్సులు రద్దు చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసిందని అన్నా రు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ రూ.1.64లక్షల కోట్లకు పెంచాలని, ఉపాధి పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉ పాధి చట్టం రక్షణ కోసం రానున్న కాలంలో వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డ బ్బీకార్‌ మల్లేష్‌, రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, పార్టీ మండల కార్యదర్శి మాలోతు వినోద్‌, సీనియర్‌ నాయకులు పాపానాయక్‌, దయానంద్‌, ఖాజా మోహిదిన, సైదులు పా ల్గొన్నారు.

  


Read more