ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-09-27T06:26:21+05:30 IST

సంప్రదాయ ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ కోరారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్‌ అధికారికి ఫోన్‌లో సూచనలు చేశారు.

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి : ఎస్పీ

సూర్యాపేటక్రైం, సెప్టెంబరు 26: సంప్రదాయ ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ కోరారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్‌ అధికారికి ఫోన్‌లో సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో బతుకమ్మ, దుర్గామాతా ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి ఇతరులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎవరైనా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు దరఖాస్తు ఇచ్చిన వెంటనే పోలీస్‌ అధికారులు స్పందించి శాఖపై మరింత విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహిచాలన్నారు. ప్రతీ ఒక్కరు చట్టానికి లోబడి నడుచుకోవాలని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more