కారు డ్రైవర్‌ అరెస్టు, రిమాండ్‌

ABN , First Publish Date - 2022-04-24T05:37:26+05:30 IST

కోదాడ పట్టణ సమీపంలో జాతీయరహదారిపై మేళ్లచెర్వు ఫ్లైఓవర్‌పై బైక్‌ను ఢీకొట్టి ముగ్గురు మృతికి కారణమైన కారు

కారు డ్రైవర్‌ అరెస్టు, రిమాండ్‌

కోదాడ, ఏప్రిల్‌ 23 : కోదాడ పట్టణ సమీపంలో జాతీయరహదారిపై మేళ్లచెర్వు ఫ్లైఓవర్‌పై బైక్‌ను ఢీకొట్టి ముగ్గురు మృతికి కారణమైన కారు డ్రైవర్‌ రాపోలు యశ్వంత్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. పట్టణ సీఐ నరసింహరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లోని హస్తినాపురం కాలనీకి చెందిన పెనుగొండ రామకృష్ణ బంధువుల నిశ్చితార్థం కార్యక్రమం గుంటూరులో ఉండగా, యశ్వంత్‌ను కారుడ్రైవర్‌గా తీసుకొని వెళ్లారు. శుభకార్యం ముగించుకొని సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంటికి వెళ్లాలనే తొందరలో అతి వేగంగా కారు నడుపుతూ యశ్వంత్‌, కోదాడ సమీపంలో రాగనే బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో బోయిల శ్రీనివా్‌సతో పాటు భార్య, కుమార్తె మృతి చెందారు. కుమార్తెలు హన్షిక, ఐశ్వర్యలకు తీవ్రగాయాలు అయినట్లు తెలిపారు. ముగ్గురు మృతికి కారణమైన యశ్వంత్‌పై శ్రీనివాస్‌ తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. 

Read more